కర్నూలు జిల్లా ఆదోనిలోని వంశీచైతన్య ఆసుపత్రిలో పసికందు అపహరణ కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. టీకా వేయిస్తానని మాయమాటలు చెప్పి బురుఖా వేసుకున్న మహిళ పాపను అపహరించినట్టు వెల్లడించారు. పాప తండ్రి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సీసీ కెమెరాల దృశ్యాలు, ఆటో డ్రైవర్ల వద్ద ఉన్న సమాచారంతో కేసును ఛేదించి పాపను తల్లిదండ్రులకు అప్పగించారు.
Baby kidnap: పసికందు కిడ్నాప్ కేసు..ముగ్గురు అరెస్ట్
ఆదోని ఆస్పత్రిలో పసికందు కిడ్నాప్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. కిడ్నాప్‌నకు సహకరించిన ముగ్గురు మహిళలను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ ఫకీరప్ప తెలిపారు. అనంతరం పాపను తల్లిదండ్రులకు అప్పగించారు.
Baby
పాప పేరును దిశ అని పెట్టాలని ఎస్పీ ఫక్కీరప్ప కోరగా.. తల్లిదండ్రులు అందుకు అంగీకరించారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరిగితే ఆసుపత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు.
ఇదీ చదవండి
ATM: ఎమ్మిగనూరులోని స్టేట్ బ్యాంక్ ఏటీయంలో చోరీయత్నం
Last Updated : Jun 5, 2021, 6:47 PM IST