ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆర్టీసీ బస్సులో దొంగతనం కేసు.. మహిళ అరెస్ట్ - Adoni-Pathikonda RTC bus theft case latest news

కర్నూలు జిల్లా ఆదోని - పత్తికొండ ఆర్టీసీ బస్సులో జరిగిన దొంగతనం కేసులో ఓ మహిళ అరెస్ట్ అయ్యింది. మరో మహిళ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఆదోని దొంగతనం కేసు
adhoni theft case

By

Published : May 3, 2021, 6:53 PM IST

Updated : May 3, 2021, 7:10 PM IST

కర్నూలు జిల్లాలోని ఆదోని - పత్తికొండ ఆర్టీసీ బస్సులో గత నెల 13న జరిగిన దొంగతనం కేసులో ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. తుగ్గలి మండలం రాతన గ్రామానికి చెందిన మహిళ ఆదోని వైపు వెళ్తుండగా చోరీ జరిగింది. ఆస్పరి గ్రామంలో గుర్తు తెలియని మహిళ... బాధితురాలి పక్కనే కూర్చున్న తర్వాత ఘటన జరిగినట్టు పోలీసులు గుర్తించారు.

కేసు నమోదు చేసిన దర్యాప్తు చేసిన పోలీసులు.. ఇద్దరు మహిళలు దొంగతనం చేసినట్లు దర్యాప్తులో తేల్చారు. వారిలో ఇప్పటికే ఒకరిని అదుపులో తీసుకొని చోరీని నిర్థరించారు. ఆమె నుంచి రూ. 2.53 లక్షల విలువైన 53 గ్రాముల బంగారం రికవరీ చేశారు. మరో మహిళ పరారీలో ఉందని డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు.

Last Updated : May 3, 2021, 7:10 PM IST

ABOUT THE AUTHOR

...view details