సలాం ఆత్మహత్య కేసులో అరెస్ట్ అయిన సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ బెయిల్ రద్దు విషయంలో పోలీసులు మరో అడుగు ముందుకు వేశారు. . ఇద్దరిపై 306 సెక్షన్ అమలు చేయాలని కోరుతూ ఇవాళ మరో పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన నంద్యాల మూడో అదనపు జిల్లా కోర్టు.. కేసును ఈనెల 23కు వాయిదా వేసింది. ఈ కేసులో ప్రభుత్వం తరుపున విజయవాడ నుంచి అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆన్లైన్ ద్వారా వాదనలు వినిపించనున్నారు.
సలాం ఆత్మహత్య కేసు: మరో పిటిషన్ దాఖలు చేసిన పోలీసులు - police file petition in kurnool family suicide case
సలాం ఆత్మహత్య కేసులో పోలీసులు మరో పిటిషన్ దాఖలు చేశారు. సీఐ, హెడ్ కానిస్టేబుల్‌పై 306 సెక్షన్ అమలు చేయాలని కోరారు. పిటిషన్‌పై విచారించిన కోర్టు... ఈనెల 23కు వాయిదా వేసింది.
kurnool family suicide case