Police Crack Hyderabad Kidnapping Case: ఇటీవల కాలంలో డబ్బు కోసం ఎన్నో అరాచకాలకు ఒడిగడుతున్నారు. మానవతా విలువలు మరిచిపోయి.. అయిన వారు అని కూడా చూడకుండా నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పైసల కోసం ఓ బావమరిది.. ఏకంగా బావను కిడ్నాప్ చేసి డబ్బలు వసూలు చేశాడు. ఇందుకోసం నకిలీ ఐటీ అధికారుల అవతారమెత్తి.. బాధితుడిని భయభ్రాంతులకు గురి చేశారు.
గతనెల 27న జరిగిన ఈ ఘటనను పోలీసులు ఛేదించారు. విచారణలో భాగంగా పోలీసులకు కొన్ని ఆశ్చర్యపోయే అంశాలు తెలిశాయి. ఈ కిడ్నాప్ కేసులో బావమరిదే ప్రధాన సూత్రధారి అని వారు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలను తెలంగాణ రాష్ట్రం పంజాగుట్ట ఏసీపీ మోహన్‌కుమార్ వెల్లడించారు. రోడ్డుపై వెళుతున్న మురళీకృష్ణను ఇన్నోవాలో వచ్చిన నిందితులు ఐటీ అధికారులమని బెదిరించి అపహరించుకుపోయారని చెప్పారు. నగరశివారు బాటసింగారం వద్దకు తీసుకెళ్లగా భయపడిన మురళీకృష్ణ.. తన బావమరిది రాజేశ్ ద్వారా నిందితులు అడిగిన రూ.30 లక్షలు తెప్పించుకుని వారికి అప్పగించారని వివరించారు.