కర్నూలు జిల్లాలో నాటుసారా తయారీ, అక్రమ మద్యం రవాణాలపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లోని పుల్లూరు చెక్ పోస్టు వద్ద ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వాహనాలు తనిఖీలు నిర్వహించారు. పోలీసులను చూసి పరిగెత్తిన వ్యక్తిని చేజ్ చేసి పట్టుకున్నారు.
ఆ వ్యక్తి బ్యాగులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మద్యం బాటిళ్లు గుర్తించారు. మరి కొందరు వాహనం ఆపకుండా వేగంగా వెళ్లి పోలీసుల నుంచి తప్పించుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా నాటు సారా అమ్మకందారులు, అక్రమ మద్యం రవాణా చేసే 25 మందిని పోలీసులు అరెస్టు చేసి... 5 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు.