ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హత్య కేసును ఛేదించిన పోలీసులు... నలుగురు అరెస్టు - murder in kurnool district

కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన హత్య కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఉద్దేశపూర్వకంగానే నిందితులు.. ఈ ఘాతూకానికి ఒడిగట్టినట్లు తెలిపారు.

police chase murder case in nandhyala kurnool district
హత్య కేసును ఛేదించిన పోలీసులు... నలుగురు అరెస్టు

By

Published : Oct 29, 2020, 3:56 PM IST

కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన హత్య కేసును నంద్యాల పోలీసులు ఛేదించారు. నలుగురి నిందితులను అరెస్టు చేశారు. పొన్నాపురం గ్రామానికి చెందిన మనోహర్ గౌడ్, పెద్ద కొట్టాలకు చెందిన రవికుమార్, సురేంద్ర, హరి నాయక్​లు కలిసి ఈ హత్య చేసినట్లు నంద్యాల డీఎస్పీ చిదానందరెడ్డి తెలిపారు.

తెదేపాలో కొనసాగుతోన్న మనోహర్ గౌడ్... ఇటీవల వైకాపా లో చేరేందుకు ప్రయత్నిస్తుండగా... సుబ్బరాయుడు అడ్డుతగులుతున్నాడని భావించాడు. దీనిపై కోపం పెంచుకున్న మనోహర్ గౌడ్.. సుబ్బరాయుడును హతమార్చాలని భావించాడు. ఈ క్రమంలో సుబ్బారాయుడిని కట్టెతో కొట్టి హతమార్చాడు. ఈఘటనపై నమోదైన కేసు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేసి, నిందితులను అరెస్టు చేశారు.

ఇదీచదవండి.

ఎన్నికలు వద్దనడం ఓటమి భయమే: యనమల

ABOUT THE AUTHOR

...view details