చిన్న పిల్లలను కిడ్నాప్ చేసిన కేసులో నిందితుడిని కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 23న స్వామిరెడ్డి నగర్‌కు చెందిన అక్కాతమ్ముడు ఇంటి ముందు ఆడుకుంటుండగా చాక్లెట్ కొనిస్తానని గుర్తుతెలియని వ్యక్తి తీసుకొని వెళ్లాడు. గమనించిన స్థానికులు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వటం.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిల్లలను నిందితుడు ద్విచక్రవాహనంపై తీసుకెళ్తుండగా.. బాలిక ఏడవటంతో భయపడిన నిందితుడు పాపను మద్దురునగర్లో వదిలివెళ్లాడు. గమనించిన స్థానికుడు పాపను పోలీసులకు అప్పగించాడు. నగరంలో మోకానిక్‌గా పని చేస్తున్న హనీఫ్ పిల్లలను తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు మద్యం సేవిస్తే మతిస్థిమితం కోల్పోతాడని... అతనికి చిన్న పిల్లలను ఆడించే అలవాటు ఉన్నట్లు తమ విచారణలో తెలిసిందని డీఎస్పీ తెలిపారు.
అక్కాతమ్ముడు కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
కర్నూలు జిల్లాలో అక్కాతమ్ముడిని కిడ్నాప్ చేసిన కేసును పోలీసులు ఛేదించారు. మోకానిక్‌గా పని చేస్తున్న హనీఫ్ పిల్లలను తీసుకెళ్లినట్లు గుర్తించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
అక్క, తమ్ముడు కిడ్నాప్ కేసును చేధించిన పోలీసులు
ఇవీ చూడండి...