కర్నూలు జిల్లా నందవరం మండలంలోని నాగలదిన్నె నుంచి కనకవీడు రహదారిలో సీఐ మహేశ్వరరెడ్డి, ఎస్సై నాగరాజు ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా... 1344 కర్ణాటక మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్ర వాహనాలపై మద్యాన్ని తరలిస్తున్న కనకవీడు పేటకు చెందిన లింగమూర్తి, తిమ్మప్ప, లింగన్నలను అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు నిందితులు తప్పించుకున్నారని వారందరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా మద్యం రవాణా.. ముగ్గురు అరెస్టు - కర్నూలు జిల్లాలో మద్యం అక్రమ రవాణా తాజా వార్తలు
కర్నూలు జిల్లా పోలీసులు.. కర్ణాటక మద్యాన్ని పట్టుకున్నారు. సరఫరా చేస్తున్న ముగ్గురిని అరెస్టు చేశారు.
అక్రమ మద్యం రవాణాలో యువకులు