ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలు జిల్లాలో పోలీసు సబ్సిడీ క్యాంటీన్లు - కర్నూల్​ సబ్ డివిజన్​లలో పోలీస్ క్యాంటీన్

ఇప్పటి వరకు జిల్లా కేంద్రాలకే పరిమితమైత పోలీస్ సబ్సిడీ క్యాంటీన్లు ఇక నుంచి డివిజన్ స్థాయిలో కూడా అందుబాటుకి వచ్చాయి. కర్నూలు ఎస్పీ ఫకీరప్ప పోలీస్ క్యాంటీన్ సేవలు అందరూ వినియోగించుకోవాలనే ఉద్దేశంతో జిల్లాలో సబ్ డివిజన్ స్థాయిలో క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. బయటి మార్కెట్​తో పోలిస్తే 20 నుంచి 30 శాతం తక్కవ ధరకు ఇక్కడ సరుకులు దొరుకుతున్నాయని ఆళ్లగడ్డ పోలీస్ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.

police canteen in sub divisions in kurnool
కర్నూలు సబ్​ డివిజన్​లలో పోలీస్ క్యాంటీన్

By

Published : Jan 29, 2020, 4:59 PM IST

కర్నూలు సబ్​ డివిజన్​లలో పోలీస్ క్యాంటీన్

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో పోలీస్ క్యాంటీన్ ఏర్పాటు చేయటంపై అక్కడి సిబ్బందికి ఇబ్బందులు తప్పాయి. సాధారణంగా పోలీస్ క్యాంటీన్ జిల్లా కేంద్రంలో ఒక్క చోటే ఉంటుంది. పోలీస్ సిబ్బంది అక్కడికి వెళ్లి తమకు కావల్సిన వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. దాదాపు 100 కిలోమీటర్లు దూరం ప్రయాణించి, సరుకులు తెచ్చుకోవటం సిబ్బందికి ఇబ్బందులుండేవి. కర్నూలు ఎస్పీ ఫకీరప్ప చొరవ తీసుకుని సబ్ డివిజన్ స్థాయిలో క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ఇలా జిల్లాలో 6 సబ్ డివిజన్​లో నెలలో ఒక రోజు చొప్పున ఈ క్యాంటీన్ ఏర్పాటు చేస్తున్నారు. నిర్వాహకులు జిల్లా కేంద్రం నుంచి వాహనాల్లో సరుకులు తీసుకు వచ్చి పోలీస్ సిబ్బందికి అందుబాటులో ఉంచుతున్నారు. దీని వల్ల ఒక్కో పోలీస్​కు నెలకు 5 వందల రూపాయల వరకూ లబ్ధి చేకూరుతుందని తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details