కర్నూలు జిల్లా గడివేముల మండలం బోగుల గ్రామంలోని నాటుసారా తయారీ స్థావరాలపై దాడులు నిర్వహించేందుకు.. గడివేముల పోలీస్ స్టేషన్లో పనిచేస్తోన్న ఇద్దరు కానిస్టేబుళ్లు తమ ద్విచక్రవాహనాలపై వెళ్లారు. బట్టీలను ధ్వంసం చేసి, తిరిగి వచ్చి చూడగా.. ఒక ద్విచక్రవాహనం ఇంజన్‌కు నిప్పు పెట్టారు. మరో వాహనంలో గాలి తీశారు. నాటుసారా తయారీ దారులే ఈ పని చేసి ఉంటారని వారు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నాటుసారా స్థావరాలపై దాడులకు వెళ్తే... వాహనానికి నిప్పు పెట్టారు..! - కర్నూలు జిల్లా వార్తలు
కర్నూలు జిల్లా బోగులలో నాటుసారా తయారీ స్థావరాలపై దాడికి వెళ్లిన పోలీసులకు ఊహించని ఘటన ఎదురైంది. వారి ద్విచక్రవాహనం ఇంజన్‌కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. సారా తయారీ దారులే ఈ పని చేసి ఉంటారని వారు అనుమానం వ్యక్తం చేశారు.
![నాటుసారా స్థావరాలపై దాడులకు వెళ్తే... వాహనానికి నిప్పు పెట్టారు..! police bike damaged in assault at bogula kurnool district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8197602-589-8197602-1595873708965.jpg)
దుండగుల దాడిలో కాలిపోయన ఇంజిన్ భాగం