నకిలీ పత్తి విత్తనాలు నిల్వ ఉన్న గోదాముపై వెల్దుర్తి పట్టణంలో స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ విజయలక్ష్మి దాడులు చేశారు. నకిలీ విత్తనాల తయారీ దారుడు రత్నాకర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిందితుడు గత సంవత్సరం కూడా నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతూ పట్టుబడ్డాడు. రైతుల అవసరాలు ఆసరాగా చేసుకొని నకిలీ దందా సాగిస్తున్నాడు. వీటి విలువ దాదాపు 30 లక్షల ఉంటుందని డీఎస్పీ నరసింహారెడ్డి తెలిపారు. ఇంత భారీ మొత్తంలో నకిలీ దందా సాగిస్తున్నా వ్యవసాయ అధికారులకు తెలియకపోవడం కొసమెరుపు.. కాగా విషయం తెలిసినా పట్టించుకోవడంలేదన్న విమర్శలున్నాయి.
వెల్దుర్తిలోని నకిలీ విత్తనాల గోదాములపై దాడులు - fake seeds in kurnool district
కర్నూలు జిల్లా వెల్దుర్తి పట్టణంలో స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ విజయలక్ష్మి ఆధ్వర్యంలో నకిలీ పత్తి విత్తనాలు నిల్వ ఉన్న గోదాముపై దాడులు నిర్వహించారు. 150 బస్తాలు నకిలీ పత్తి విత్తనాలు, విత్తనాలు నింపే కవర్లు, కాంటా మిషన్‌ను సీజ్ చేశారు.

నకిలీ విత్తనాలు గోదాములపై పోలీసుల దాడులు