ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిందితులను తప్పించే యత్నం.. ముగ్గురు అరెస్ట్ - police

పేకాట కేసులో నిందితులను తప్పించే ప్రయత్నం చేసిన పోలీసులపై రెండు రోజుల క్రితం  కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. వేరే వారికి బదులు కోర్టుకు హాజరైన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిందితులను తప్పించే యత్నం కేసులో ముగ్గురి అరెస్ట్

By

Published : Sep 17, 2019, 11:44 PM IST

నిందితులను తప్పించే యత్నం కేసులో ముగ్గురి అరెస్ట్

కర్నూలు జిల్లా కోసిగిలోని నమోదైన పేకాట కేసులో... వేరే వారికి బదులు కోర్టుకు వెళ్లిన ముగ్గురిని అదుపులో తీసుకున్నట్లు తెలిపారు. నిందితులను తప్పించే ప్రయత్నం చేసిన పోలీసులపై రెండు రోజుల క్రితం కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి విదితమే. గత నెలలో పేకాట ఆడుతున్న పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని కోర్టుకు హాజరుపర్చే సమయంలో నలుగురి స్థానంలో వేరే వారిని తీసుకెళ్లారు. కేవలం జరిమానా మాత్రమే పడుతుందని చెప్పి కోర్టుకు తీసుకెళ్లగా వారికి జరిమానాతో పాటు వారం రోజుల జైలు శిక్ష విధించింది. దీంతో కోర్టు ఆవరణలోనే పోలీసులతో ఆ నలుగురు వాగ్వాదానికి దిగగా అసలు విషయం బయటపడింది. ఎస్సై, ఏఎస్సైలతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లపై రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలో నిందిత పోలీసులనూ అదుపులో తీసుకుంటామని సీఐ గౌస్ అన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details