భాజపా నాయకురాలు బైరెడ్డి శబరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం సంగమేశ్వరం వద్ద.. తుంగభద్ర నదిలో పుష్కర స్నానమాచరించినందుకు చర్యలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించారంటూ.. శబరితో పాటు ఆమె అనుచరులను అదుపులోకి తీసుకున్నారు.
భాజపా నాయకురాలు బైరెడ్డి శబరి అరెస్ట్ - తుంగభద్రలో పుష్కర స్నానం చేసినందుకు కర్నూలు భాజపా నాయకురాలి అరెస్ట్
సీఎం జగన్ హిందూ సాంప్రదాయాలను మంటగలుపుతున్నారంటూ.. భాజపా నాయకురాలు బైరెడ్డి శబరి ఆరోపించారు. కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం సంగమేశ్వరం వద్ద నిబంధనలు మీరి తుంగభద్రలో స్నానం చేశారంటూ.. శబరితో పాటు ఆమె అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నదిలో స్నానమాచరిస్తున్న బైరెడ్డి శబరి
సంగమేశ్వర క్షేత్రంని సందర్శించిన భాజపా నాయకురాలు శబరి.. తన అనుచరులతో కలిసి తుంగభద్ర నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం సంగమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేయించారు. నిబంధనల ప్రకారం నదిలో స్నానం చేయకూడదంటూ.. పూజానంతరం పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.
ఇదీ చదవండి:కర్నూలులో తుంగభద్రమ్మకు పుష్కర హారతి