అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిని పట్టుకునేందుకు కర్నూలులో పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. నగరంలోని ఒకటవ పట్టణ పరిధిలోని తుంగభద్ర, హంద్రీ నదీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో యువకులు గుమిగూడి ఉండడంతో వారిని గుర్తించేందుకు డ్రోన్ కెమెరాతో చిత్రీకరిస్తున్నారు. దీంతో అక్కడ ఉన్న వారు డ్రోన్ కెమెరాను చూడగానే..పరుగులు తీశారు.
డ్రోన్‌ను చూడగానే... పరుగుతీశారు... - కర్నూలు జిల్లా తాజా వార్తలు
కరోనా కట్టడిలో పోలీసులు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఓ వైపు వైరస్‌పై ప్రజల్లో అవగాహన పెంచుతూ.. మరోవైపు నేరాలు తగ్గడానికి కృషి చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్న వారిని పట్టుకోవడానికి పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. దట్టమైన చెట్లున్న ప్రాంతం, నదిపరివాహాక ప్రాంతంలో డ్రోన్ కెమెరాలతో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.
కర్నూలు జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలకై డ్రోన్ కెమెరా