ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బ్యాంకు ఎదుట గుమిగూడిన జనం.. మచ్చుకైనా కానరాని భౌతిక దూరం - people are not following carona precautions

కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. ఎక్కువ మంది జనం ఒకే చోట గుమిగూడవద్దని ప్రభుత్వం చెప్తున్నా.. బ్యాంకు అధికారులకు, ప్రజలకు పట్టడం లేదు. కర్నూలు జిల్లా ఆస్పరి గ్రాామీణ బ్యాంకు వద్ద ఇలాంటి పరిస్థితే కనిపించింది. అక్కడ గుమిగూడిన జనాన్ని చూస్తే కరోనా వస్తుందేమో అన్న భయం కలగకమానదు.

kurnool district
బ్యాంకు వద్ద కనపడని భౌతిక దూరం

By

Published : Jun 29, 2020, 6:50 PM IST

కర్నూలు జిల్లా ఆస్పరి మండల కేంద్రంలోని గ్రామీణ బ్యాంకు వద్దకు భారీగా ప్రజలు చేరుకున్నారు. గతంలో ప్రభుత్వం విడుదల చేసిన పంటల బీమా వివరాలను తెలుసుకోవటానికి ఒక్కసారిగా వందల సంఖ్యలో ప్రజలు వచ్చారు.

బ్యాంకు అధికారులు ప్రజలకు సమాచారం ఇవ్వకపోవటంతో ఈ పరిస్థితి వచ్చిందని పలువురు విమర్శించారు. ఏ మాత్రం భౌతిక దూరం పాటించకుండా వారు అలాగే నిలుచోవడంపై.. స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న తరుణంలో.. ఇలాంటి నిర్లక్ష్యం మంచిది కాదన్నారు.

ABOUT THE AUTHOR

...view details