కర్నూలు జిల్లా నంద్యాలలోని నేషనల్ పీజీ కళాశాలలో విజయ్ అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఎమ్మెస్సీ రెండో ఏడాది చదవుతున్న విద్యార్థి.. ప్రయోగశాలలో జరుగుతున్న ప్రాక్టీకల్స్కు హాజరయ్యాడు. ఈ క్రమంలో రసాయన మిశ్రమాన్ని తాగేశాడు. విజయ్ను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలుకు తీసుకెళ్లారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి మతిస్తిమితం సరిగా లేదని అతని తండ్రి పోలీసులకు తెలిపారు.
రసాయన మిశ్రమం తాగిన పీజీ విద్యార్థి.. పరిస్థితి విషమం - నంద్యాల వార్తలు
ప్రాక్టికల్స్ కోసం కళాశాలకు హాజరైన పీజీ విద్యార్థి రసాయన మిశ్రమాన్ని తాగేశాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా నంద్యాలలోని నేషనల్ పీజీ కళాశాలలో జరిగింది. విద్యార్థి మతిస్తిమితం సరిగా లేదని అతని తండ్రి తెలిపారు.
రసాయన మిశ్రమం తాగిన పీజీ విద్యార్థి