కర్నూలు జిల్లా నంద్యాల నందమూరినగర్లో జరిగిన ఘర్షణలో ఓబులేషు అనే వ్యక్తి మృతి చెందాడు. కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్న ఓబులేసుపై.. పక్కింటి వ్యక్తి బాషా అనే వ్యక్తి ఓబులేషుపై చేయి చేసుకున్నాడు.
ఇద్దరి మధ్య ఘర్షణ ఏర్పడింది. బాషా.. ఓబులేషును కింద పడేసి చేతులతో.. కాళ్లతో విపరీతంగా దాడి చేశాడు. ఈ క్రమంలో బాధితుడు మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.