కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం సింగవరంలో గాలి వాన బీభత్సానికి ఓ వ్యక్తి మృతి చెందాడు. వేగంతో గాలి రావడం వల్ల ఇంటి పైనున్న ఇనుప రేకులు లేచి యవన్ అనే వ్యక్తి మీద పడ్డాయి. దీంతో తీవ్ర గాయాలైన అతను అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.
గాలివాన బీభత్సం..ఇనుప రేకులు పడి వ్యక్తి మృతి - కర్నూలు జిల్లాలో గాలివాన తాజా వార్తలు
ఒక్కసారిగా గాలి వాన రావటంతో... ఇంటిపై ఉన్న ఇనుప రేకులు పడి వ్యక్తి మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లా సింగవరంలో జరిగింది. అప్పటివరకూ తమతో ఉన్న వ్యక్తి హఠాత్తుగా మరణించటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇనుప రేకులు పడి వ్యక్తి మృతి