ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రాణం తీసిన భూతవైద్యం.. అత్యంత విషాదకరంగా యువకుడి మరణం - మూఢనమ్మకంతో హత్యలు వార్తలు

మూఢనమ్మకంతో కన్న బిడ్డ ప్రాణాలను బలి తీసుకున్నారు తల్లిదండ్రులు. అనారోగ్యంపాలైన కుమారుడిని భూతవైద్యుడికి చూపించారు. ఈ క్రమంలో వైద్యం పేరిట అతడిని ఈత బరిగెలతో విపరీతంగా కొట్టడంతో మృతి చెందాడు. కర్నూలు జిల్లా మద్దికెర మండలం పెరవలి గ్రామంలో ఈ విషాధ ఘటన జరిగింది.

Superstitious young man dies
మూఢనమ్మకం యువకుడు మృతి

By

Published : Jun 7, 2021, 7:18 AM IST

మూఢనమ్మకం ఓ యువకుడి ప్రాణాలు బలిగొంది. కర్నూలు జిల్లా మద్దికెర మండలం పెరవలి గ్రామానికి చెందిన వెంకటరాముడు, ఈరమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. డిగ్రీ చదువుకున్న కుమారుడు నరేశ్‌ (24) గ్రామంలో వ్యవసాయ కూలీ పనులకు వెళ్లేవాడు. ఈనెల 1న మూర్ఛతో అస్వస్థతకు గురికాగా తల్లిదండ్రులు స్థానిక భూతవైద్యుడికి చూపించారు. నరేశ్‌కు దయ్యం పట్టిందని, దాన్ని వదిలిస్తానంటూ భూతవైద్యుడు ఈత బరిగెలు, కర్రలతో తీవ్రంగా కొట్టాడు.

తలకు గాయమై, యువకుడి పరిస్థితి మరింత విషమించింది. విషయం తెలిసిన గ్రామస్థులు తల్లిదండ్రులను మందలించి ఈ నెల 4న కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మూడురోజులుగా మృత్యువుతో పోరాడిన నరేశ్‌ ఆదివారం మృతిచెందాడు. మిత్రులే డబ్బులు పోగుచేసి అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబానికి అండగా నిలవాల్సిన యువకుడు మూఢవిశ్వాసాలకు బలైన తీరు గ్రామంలో విషాదాన్ని నింపింది.

ABOUT THE AUTHOR

...view details