మహమ్మారి వైరస్ కర్కశత్వానికి దర్పణంగా నిలుస్తున్నాయి కొన్ని ఘటనలు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణం ఆర్టీసీ బస్టాండు సమీపంలో 3 రోజుల క్రితం ఓ వ్యక్తికి కరోనా సోకింది. ఆయన వయసు 50 ఏళ్లలోపే ఉండటంతో ఇంటి సమీపంలో ప్రత్యేక గదిలో ఐసొలేషన్‌లో ఉంచారు. శనివారం అకస్మాత్తుగా ఆరోగ్యం విషమించింది. ప్రైవేటు అంబులెన్సును పిలిపించి అందులోకి ఎక్కిస్తుండగానే చనిపోయారు. ఒక వైపు భర్త మృతదేహం, మరో వైపు పీపీఈ కిట్ ధరించి రోదిస్తున్న భార్య... ఆ దృశ్యం స్థానికులను కలచివేసింది. పురపాలిక సిబ్బంది సహకారంతో స్థానికులు అంత్యక్రియలు పూర్తిచేశారు.
బంధం దూరమై.. గుండె పగిలే బాధ చేరువై - కర్నూలులో కరోనా వార్తలు
మాయదారి కరోనా ధాటికి అయినవారు కళ్లెదుటే కట్టెలుగా మారుతుంటే చూసి తట్టుకోలేని గుండెలు పగులుతున్నాయి. కల్లెదుటే భర్త మరణించిన అంత్యక్రియలకు కూడా నిర్వహించలేకుపోతున్నామని రోదిస్తున్న ఘటన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో జరిగింది.
కర్నూలులో కరోనాతో వ్యక్తి మృతి