ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ట్రాక్టర్ డ్రోజరు కోసం పోలీసు స్టేషన్​ ముందు ఆందోళన - ట్రాక్టర్ వివాదంలో నంద్యాల పోలీసు స్టేషన్ ముందు ఆందోళన

కర్నూలు జిల్లా అయ్యలూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులకు చెందిన ట్రాక్టర్​ డ్రోజరును వారి సమీప బంధువు మరికొంతమందితో కలిసి తీసుకెళ్లారు. ఈ ఘటనపై నంద్యాల పోలీసు స్టేషన్​లో కేసు నమోదైంది. ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడంలేదని ట్రాక్టర్ యాజమానులు స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు.

nandyala police station
nandyala police station

By

Published : Dec 3, 2020, 4:50 AM IST

పోలీసు స్టేషన్ ముందు ట్రాక్టర్ డ్రోజరుకు నిప్పు పెట్టే యత్నం

కర్నూలు జిల్లా నంద్యాల మండలం అయ్యలూరు గ్రామానికి చెందిన రియాజ్, షఫీ అనే వ్యక్తులకు చెందిన ట్రాక్టర్ డ్రోజరును సమీప బంధువు సిరివెళ్లకు చెందిన రషీద్, మరికొంత మందితో కలిసి తీసుకెళ్లారు. ట్రాక్టర్ డ్రైవర్ మహబూబ్ బాషా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాక్టర్​ను స్వాధీనం చేసుకున్న పోలీసులు స్టేషన్ ఎదుట ఉంచారు. డ్రోజరును తిరిగి ఇవ్వడంలో జాప్యం జరిగిందని ఆగ్రహించిన రియాజ్, షఫీలు పోలీసు స్టేషన్​ ముందు ఆందోళన చేశారు.

ఈ విషయంలో పోలీసు స్టేషన్ వద్ద పంచాయితీ జరుగుతున్న క్రమంలో షఫీ మరికొంత మందితో కలిసి ట్రాక్టర్​పై పెట్రోలు పోసి నిప్పంటించే యత్నం చేశారు. దీంతో స్టేషన్​ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వెంటనే స్పందించిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. తమ వైపు ఎలాంటి నిర్లక్ష్యం లేదని సీఐ దివాకరరెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి :'కొవిడ్ వ్యాక్సిన్​ వేసేందుకు వివరాలు తయారు చేయండి'

ABOUT THE AUTHOR

...view details