కర్నూలు జిల్లా ఆదోనిలో మట్కా నిర్వహిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలోని టీజీఎల్ కాలనీలో స్కూటర్‌పై కూర్చొని ఆట నిర్వహిస్తున్న మోహన్‌ను పోలీసులు గుర్తించారు. అతని వద్ద నుంచి 67 వేల నగదు, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా అతడి ఇంట్లో తనిఖీలు చేసి ఏటీఎం కార్డులు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ రామకృష్ణ తెలిపారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆదోనిలో మట్కా నిర్వహిస్తున్న వ్యక్తి అరెస్ట్ - adoni town latest news
ఆదోనిలోని టీజీఎల్ కాలనీలో మట్కా నిర్వహిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతని వద్ద నుంచి నగదు, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
మట్కా నిర్వహిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు