ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలులో కలుషిత నీరు తాగి 25 మందికి అస్వస్థత - kurnool district news

కలుషిత నీరు తాగి 25 మంది అస్వస్థతకు గురైన ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. బాధితులంతా ఆదోని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అధికారుల నిరక్ష్యం వల్లే ఈ దారుణం జరిగిందని గ్రామస్థులు వాపోయారు.

people sick in kurnool district after drinking contaminated water
కర్నూలులో కలుషిత నీరు తాగి 25 మంది అస్వస్థత

By

Published : Feb 15, 2021, 8:42 PM IST

కర్నూలు జిల్లా కౌతాళం మండల ఉరుకుంద గ్రామంలో 25 మంది కలుషిత నీరుతాగి అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు అయ్యాయి. కలుషిత నీరు కారణంగానే ఇలా జరిగిందంటూ గ్రామస్థులు వాపోయారు. బాధితులు ఆదోని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల చాలామంది అనారోగ్యం పాలయ్యారని... గ్రామానికి వచ్చి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details