కర్నూలు జిల్లా ఆదోనిలో తహసీల్దార్ కార్యాలయం నుంచి పెళ్లి అనుమతి కోసం జనాలు బారులు తీరారు. మే నెలలో ముహూర్తాలు భారీగా ఉన్నాయి.పెళ్లి కోసం అధికారుల అనుమతి తప్పనిసరి అయిన కారణంగా.. గంటల పాటు వరుసలో నిలబడి ఉండాల్సి వస్తోంది. కోవిడ్ నిబంధనలు మరిచి మరి క్యూలో నిల్చున్నారు. రద్దీ కారణంగా.. కొందరు 2, 3 రోజుల పాటు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు.
వివాహాల అనుమతికి.. తహసీల్దార్ కార్యాలయంలో జనాల క్యూ! - ఆదోనిలో పెళ్లి అనుమతులు వార్తలు
వివాహానికి అనుమతి తీసుకోవాలని తప్పనిసరిగా షరతు పెట్టిన కారణంగా.. ఉన్నతాధికారుల అనుమతుల కోసం వెళ్లే వారి సంఖ్య పెరిగింది. కర్నూలు జిల్లా ఆదోనిలో పెళ్లి కోసం తాహసీల్దార్ పర్మిషన్ తీసుకోవడానికి బారులు తీరారు. కోవిడ్ నిబంధనలు మరిచి క్యూలో నిల్చున్నారు.
ఆదోనిలో పెళ్లి అనుమతుల కోసం క్యూ