లాక్డౌన్ నేపథ్యంలో రేషన్ దుకాణాల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యం, కంది పప్పు తీసుకునేందుకు పట్టణంలో చౌక దుకాణాల వద్ద ప్రజలు ఎక్కువ సంఖ్యలో గుమిగూడారు. ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ క్యూలైన్లో ఉండాలని పోలీసులు సూచనలు చేస్తున్నా.. అంతగా స్పందన రావడం లేదు. ఫలితంగా డీలర్లకు ఇబ్బందిగా మారింది.
అదోనిలో రేషన్ దుకాణాల వద్ద ప్రజల బారులు - corona news in adhoni
లాక్డౌన్ నేపథ్యంలో కర్నూలు జిల్లా ఆదోనిలో రేషన్ దుకాణాల వద్ద తెల్లవారుజామునుంచే ప్రజలు బారులు తీరారు. ప్రజలు గుంపులుగా ఉండొద్దని.... పోలీసులు హెచ్చరిస్తున్నా సామాజిక దూరం పాటించడం లేదు.

అదోనిలో రేషన్ దుకాణాల వద్ద ప్రజల బారులు