కరోనా వేళా బతకడానికే ఇబ్బందిగా ఉంటే.. ప్రభుత్వం విధించే పన్నుల వల్ల మరిన్ని కష్టాలు ఎదుర్కొంటామని ప్రజలు వాపోతున్నారు. పన్ను పెంపును రద్దు చేయాలని వారు కోరుతున్నారు.
మరీ ఇంత పన్నా..?
రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో ఆస్తి విలువ ఆధారిత పన్ను, చెత్త పన్ను విధింపునకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. ఆస్తి పన్ను పెరుగుదల.... 15 శాతానికి పరిమితం చేశామని చెబుతున్నా.. ఏటా ఆస్తి విలువతో పాటు అదీ పెరుగుతూనే ఉంటుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ విలువ సర్వే చేయాలని.. ఆన్‌లైన్‌లో అది నమోదు కాని పక్షంలో సర్వే చేసి పొందుపర్చాలని ప్రభుత్వం నుంచి జిల్లాలకు ఆదేశాలు జారీ అయ్యాయి.
కర్నూలులో 5 సెంట్ల స్థలంలో 1500 చదరపు అడుగుల్లో ఇల్లు నిర్మిస్తే.. కొత్త విధానంలో లెక్కిస్తే స్థలం, నిర్మాణ విలువ కలిపి మొత్తం 61లక్షలు అవుతుంది. దీనిపై పన్నుగా 0.15శాతం అంటే 9వేల 150... లైబ్రరీ సెస్‌గా మరో 732 రూపాయలు కలుపుకుని మొత్తం 9వేల 882 రూపాయలు కట్టాల్సి వస్తుంది.