ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలు పశ్చిమ ప్రాంతాల నుంచి.. పిల్లాజెల్లతో వలసబాట! - ap 2021 news

ఈ ఏడాది ఆశించిన వర్షాలు కురవక.. సాగు పనులు లేక కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంత ప్రజలు పిల్లాజెల్లలతో వలసబాట పట్టారు. దాదాపు రెండు లక్షల మంది కర్ణాటక, తెలంగాణకు వలస వెళ్లనున్నట్లు అంచనా.

people-migration-with-their-childs-from-the-western-parts-of-kurnool
కర్నూలు పశ్చిమ ప్రాంతాల నుంచి పిల్లాజెల్లలతో వలసబాట
author img

By

Published : Nov 8, 2021, 8:24 AM IST

కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతం నుంచి మళ్లీ వలసలు మొదలయ్యాయి. ఈ ఏడాది ఆశించిన వర్షాలు కురవక స్థానికంగా సాగు పనులు లేవు. అరకొరగా వేసిన పత్తి, మిరప పంటలకు తెగుళ్లు సోకి రైతులు అప్పుల పాలయ్యారు. ఉన్న ఊరిలో కూలి దొరక్క, ఉపాధి హామీ పనులకు వెళ్లినా.. బిల్లులు రాక సతమతమవుతున్నారు. ఆదివారం ఒక్కరోజే కోసిగి మండల కేంద్రంలోని 2, 3, 4వ వార్డులకు చెందిన 3 వేల మందికిపైగా ఇరవై వాహనాల్లో కర్ణాటకలోని యాదగిరి జిల్లాకు వలస (సుగ్గి) వెళ్లారు.

ప్రస్తుతం అక్కడ పత్తి తీత పనులు జోరుగా సాగుతున్నాయని, పెద్దలకు రూ.400, చిన్నారులకు రూ.200 దాకా కూలీ దొరుకుతుందని చెప్పారు. కొందరు గ్రామ వాలంటీర్లు సైతం కూలీలతో కలిసి వలసబాట పట్టడం కరవుకు అద్దం పడుతోంది. కర్నూలు జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచీ ఈ సీజన్‌లో దాదాపు రెండు లక్షల మంది కర్ణాటక, తెలంగాణకు వలస వెళ్లనున్నట్లు అంచనా.

ఇదీ చూడండి:ఆ విషయమై గొడవ.. జవాన్ల మధ్య కాల్పులు.. నలుగురు మృతి!

ABOUT THE AUTHOR

author-img

...view details