వైకాపా ప్రభుత్వం సంక్షేమ పథకాలను రద్దు చేసే ప్రభుత్వంగా మారిందని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు. వైసీపీకి ఓటు వేసినందుకు ప్రజలు తమ తప్పును తెలుసుకున్నారన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కటీ ముఖ్యమంత్రి నెరవేర్చలేదని అన్నారు. పేద ప్రజలకు ఐదు రూపాయలకే అన్నం పెట్టే అన్న క్యాంటీన్‌ను రద్దు చేయడం ఏంటని ప్రశ్నించారు. నీరు చెట్టు పథకం కింద చాలా మందికి చెక్కులు ఇచ్చారని వాటికి సంబంధించి డబ్బులు ఇవ్వడం లేదని ఈ విషయంపై కోర్టుకు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు.
'వైకాపాకి ఓటేసినందుకు.. ప్రజలు తప్పు తెలుసుకున్నారు' - somisetty
వైకాపాకు ఓటేసినందుకు ప్రజలు తమ తప్పులను తాము తెలుసుకున్నారని కర్నూలు జిల్లా తెదేపా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు వ్యాఖ్యనించారు. జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను రద్దు చేసే ప్రభుత్వంగా మారిందన్నారు.
జిల్లా తెదేపా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు