ఆధార్ అప్డేట్ కోసం కర్నూలు ప్రధాన పోస్ట్ ఆఫీసుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. అప్డేట్ కోసం ప్రజలకు టోకెన్లు ఇస్తామని పోస్ట్ ఆఫీస్ అధికారులు సమాచారం ఇచ్చారు. నగరవాసులు ఉదయం నుంచే పోస్టాఫీసుకు చేరుకున్నారు. అయితే అధికారులు వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది.
ఆధార్ అప్డేట్ కోసం పోస్టాఫీసుకు భారీగా తరలివచ్చిన ప్రజలు - కర్నూలులో ఆధార్ అప్డేట్ తాజా వార్తలు
ఆధార్ అప్డేట్ కోసం కర్నూలు ప్రధాన పోస్ట్ ఆఫీస్ కార్యాలయం ముందు ప్రజలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. నగరవాసులు ఉదయం నుంచే పోస్టాఫీసుకు చేరుకున్నారు. ప్రజలు భారీగా రావడంతో పోలీసులు వారిని అక్కడినుంచి పంపించి వేశారు.
ఆధార్ అప్డేట్ కోసం పోస్ట్ ఆఫీస్ కార్యాలయం ముందు ప్రజల బారులు
కరోనా ఉన్నందున ప్రజలు గుమిగూడటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆధార్ అప్డేట్ సచివాలయంలో చేస్తారని పోలీసులు వారిని అక్కడినుంచి పంపించి వేశారు. అధికారులు తమకు సరైన సమాచారం ఇవ్వక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి.'మీరిచ్చే స్థలాల్లో ఇళ్లు కట్టుకునే అవకాశం ఉందా..?'