లాక్డౌన్ నేపథ్యంలో అత్యవసర సేవలు చేస్తున్న సిబ్బందికి దాతలు సహాయం అందిస్తున్నారు. కర్నూలు జిల్లా పాణ్యంలో ఓ దంపతులు ఆటోలో ఆహార పొట్లాలను, మంచి నీటి ప్యాకెట్లు రోడ్డుపై ఉన్న వారికి ఇచ్చారు. శాంతి ఆశ్రమ ట్రస్ట్ ఆధ్వర్యంలో పోలీసులకు అరటి పండ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించారు. ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
పాణ్యంలో అన్నదానం... దాతల సహాయం - పాణ్యంలో లాక్డౌన్
కరోనా వైరస్ నేపథ్యంలో హోటళ్లు బంద్ కావడంతో అత్యవసర సేవలు చేస్తున్న సిబ్బందిని పలువురు దాతలు ఆదుకుంటున్నారు. కర్నూలు జిల్లా పాణ్యంలో ప్రభుత్వాసుపత్రి ఎదుట.. రోగులకు, వారి సహాయకులకు అన్నదానం చేశారు.
పాణ్యంలో అన్నదానం