ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అర్థరాత్రి విద్యుత్ కోతలు.. ఆగ్రహంలో గ్రామస్తులు - విద్యుత్ కోత

కర్నూలు జిల్లా కల్లుదేవకుంట ప్రజలు.. విద్యుత్ కోతలతో నిత్యం అర్థరాత్రి వేళ నరకం చూస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో.. ఆందోళన బాట పట్టారు.

కరెంట్​ కష్టాలు..గ్రామస్తుల ఆగ్రహాలు

By

Published : Sep 30, 2019, 1:44 PM IST

కరెంట్​ కష్టాలు..గ్రామస్తుల ఆగ్రహాలు

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలోని కల్లుదేవకుంటలో కొద్ది రోజులుగా రాత్రి వేళల్లో విద్యుత్తు సరఫరా నిలిపివేయటంపై గ్రామస్థులు మండిపడుతున్నారు. ఈ మేరకు గ్రామస్తులంతా విద్యుత్తు ఉపకేంద్రాన్ని ముట్టడించి ఆపరేటర్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లులయితే ముక్కు పిండి వసూలు చేస్తారు కానీ రోజుల తరబడి సరఫరా నిలిచిపోతే మాత్రం పట్టించుకోరా.. అని నిలదీశారు. ఇకపై రాత్రివేళ కోతలు ఒప్పుకొనేది లేదని హెచ్చరించారు. కొద్ది సేపు కేంద్రం వద్ద గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఉపకేంద్రం పరిధిలో మరికొన్ని గ్రామాల పరిస్థితి ఇదే అంటూ అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details