ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేరే రాష్ట్రానికి వెళ్లి మరీ పింఛన్​ అందజేసిన వాలంటీర్లు - Pension donation by ward volunteers

కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు తెలంగాణలో ఉంటున్నారు. వాలంటీర్లు అక్కడికి వెళ్లి వారికి పింఛన్లు అందజేశారు.

Pension provider to different pensioners in different areas'
'వేర్వేరు ప్రాంతంలో ఉన్న పెన్షన్ దారులకు పెన్షన్ అందివేత'

By

Published : Jul 3, 2020, 3:28 PM IST

కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఇద్దరు పెన్షన్​దారులు తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్నారు. వార్డు వాలంటీర్లు నంద్యాల నుంచి వారి వద్దకు వెళ్లి పెన్షన్ అందజేశారు. నంద్యాలలో నడిగడ్డ ప్రాంతానికి చెందిన అస్లాం బాషా అనే వికలాంగుడు తెలంగాణలోని యాదగిరిగుట్టలో ఉంటున్నారు. వాలంటీర్లు అక్కడికి వెళ్లి నాలుగు నెలల పెన్షన్ రూ.12000 అందజేశారు.

నంద్యాల సరస్వతినగర్​కు చెందిన షేక్ ఆమీర్ రంగారెడ్డి జిల్లా శివరాంపల్లెలో ఉన్నారు. 15వ వార్డుకు చెందిన తిరుమలేష్ బైక్​పై వెళ్లి ఆమెకు పింఛన్​ అందజేశారు. వందల కిలోమీటర్ల దూరం వేర్వేరుగా బైక్​పై వెళ్లి పింఛన్​ అందజేసిన ఆ వాలంటీర్లను పలువురు అభినందిస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details