ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వర్షాలతో వేరుశనగ రైతులకు నష్టాలు... మద్దతు ధరలేక మరిన్ని కష్టాలు... - peanut farmer at kurnool district news update

మూలుగుతున్న నక్కపై తాడికాయ పడ్డంటూ.. ఇప్పటికే వర్షాలతో దెబ్బతిన్న పంటలు.. అరకొర దిగుబడితో అప్పుల ఊబిలో కూరుకున్న తమకు... ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వకుండా మరింత అగాధంలోకి తోసేస్తుందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండంత ఆశతో అప్పులు చేసి పంటను మార్కెట్​కు తీసుకెళ్తున్న కర్నూలు జిల్లా రైతులకు.. అక్కడా నిరాశే ఎదురవుతుంది.

peanut-farmer-lossed-prices
వేరుశనగ రైతుకు మద్దతు ధరలేక నష్టాలు

By

Published : Oct 28, 2020, 2:21 PM IST

కొద్దిరోజుల క్రితం వర్షాలతో వేరుశనగ పంట దెబ్బతిని అవస్థలు పడ్డ రైతన్న.. ఇప్పుడు మద్దతు ధర లభించక కష్టాలు పడుతున్నాడు. జిల్లావ్యాప్తంగా ఖరీఫ్‌లో 88 వేల 266 హెక్టార్లు వేరుశనగ సాగు చెయ్యాల్సి ఉండగా... 82 వేల 506 హెక్టార్లలో పంట సాగైంది. జులై, ఆగస్టులో కురిసిన వర్షాలకు 5వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. దీనికి తోడు ఊడలు భూమిలోకి దిగక పైభాగంలోనే ఉండిపోయి దిగుబడి సైతం తగ్గింది. ఎకరాకు 40వేల రూపాయల వరకూ పెట్టుబడి పెట్టినా.. కూలీ ఖర్చులకు రాని దుస్థితి ఏర్పడింది.

వాస్తవానికి రైతుభరోసా కేంద్రాల పరిధిలో ఉన్న వేరుశనగను మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేయవచ్చు. కానీ వాస్తవ పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. ఆర్‌బీకే పరిధిలో లేని వాటిని ఆయిల్‌ఫెడ్‌ ద్వారా పంట సేకరణ జరుపుతున్నారు. అయితే అధిక వర్షాల కారణంగా వేరుశనగ కాయలో.. తడి ఆరక, బూజు కనిపిస్తుండటంతో... ఇదే అదనుగా వ్యాపారులు 3 వేల రూపాయల లోపే కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మార్క్‌ఫెడ్‌ ద్వారా మొక్కజొన్న, కొర్ర, సజ్జ కొనుగోలు చేస్తున్న రైతు భరోసా కేంద్రాల వద్దనే.. వేరుశనగ కొనుగోలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని రైతులకు తెలియజేస్తామని అధికారులు చెబుతున్నారు.

అయితే అధికారులు స్పందించి వేరుశనగకు ఐదు వేల రూపాయలు మద్దతు ధర కల్పించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవీ చూడండి...

నంద్యాలలో చోరీ.. బంగారు ఆభరణాలు, సొత్తు మాయం

ABOUT THE AUTHOR

...view details