కర్నూలు జిల్లా నంద్యాలలో అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. వాారి నుంచి 60 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పట్టణంలోని బాలకొండహల్ లో ఓ గదిలో నిల్వ చేసి.. అక్కడి నుంచే తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో హుసేన్ బాషా అనే వ్యక్తి పరారయ్యాడు. డ్రైవర్ అమీర్ ను అరెస్టు చేసినట్లు సీఐ సోమశేఖర్ రెడ్డి తెలిపారు.
60 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత.. ఒకరు అరెస్ట్ - అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం
ప్రజలకు చౌక ధరలకు అందించే రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న నిందితులను పోలిసులు పట్టుకున్నారు. వారి నుంచి 60 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
pds rice seized in nandhyala