కర్నూలు నగరంలోని స్టాంటన్ పురం ప్రాంతానికి చెందిన రామకృష్ణ యాదవ్పై పీడీ యాక్ట్ నమోదు చేసి.. జైలుకు పంపించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై కర్నూలు జిల్లా సహా తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లాలో 14 క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
భూ కబ్జాలకు పాల్పడుతున్న వ్యక్తిపై పీడీ యాక్ట్.. - కర్నూలు సెంట్రల్ జైల్ తాజా వార్తలు
ఫోర్జరీ, చీటింగ్, తప్పుడు దస్తావేజులతో అమాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఓ వ్యక్తిపై కర్నూల్ జిల్లా పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపారు. ఇతనిపై కర్నూలు జిల్లా సహా తెలంగాణ రాష్ట్రంలో పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. భూములు సెటిల్మెంట్లలో అమాయకులను బెదిరిస్తున్నట్లు ఎస్పీ ఫకీరప్ప తెలిపారు.
ఫోర్జరీ, చీటింగ్, తప్పుడు దస్తావేజులతో అమాయకుల భూములను ఆక్రమించుకోవడం, బాధితులను కోర్టులకు లాగి కాలయాపన చేస్తూ మనోవేదనకు గురి చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. భూములను సెటిల్ మెంట్ల ద్వారా, బలవంతంగా లాక్కోవడం లాంటి చట్ట వ్యతిరేక కార్యకలపాలపై కేసులు నమోదయ్యాయి. పలు మార్లు రిమాండుకు వెళ్లి వచ్చినా.. ప్రవర్తనలో మార్పు రాకపోవటంతో పీడీ యాక్టు నమోదు చేసి కడప సెంట్రల్ జైలుకి తరలించినట్లు ఎస్పీ ఫకీరప్ప పేర్కొన్నారు.
ఇదీ చదవండి:రాజమహేంద్రవరంలో రౌడీషీటర్ దారుణ హత్య