ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బంధువులు చేయలేమన్నారు... పోలీసులు చేసి చూపించారు! - ప్యాపిలి ఎస్సై న్యూస్

కరోనా సోకే మృతి చెందాడేమో అనే అనుమానంతో ఆ వ్యాపారి అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ఎవ్వరూ ముందుకు రాలేదు. సమాచారం అందుకున్న ఎస్సై.. తానే అంత్యక్రియలు చేసి మానవత్వవ చాటుకున్నారు. కరోనా సోకిన వారిపట్ల వివక్షతో ఉండవద్దని ప్రజలను కోరారు.

police conduct funeral to corona suspect
కరోనా అనుమానితుడికి అంత్యక్రియలు నిర్వహించిన పోలీసులు

By

Published : Jul 20, 2020, 5:54 PM IST

ప్యాపిలీ ఎస్సై మానవత్యం... స్వయంగా అంత్యక్రియలు నిర్వహించిన అధికారి

పోలీసులంటే కఠినంగా ఉంటారు అనేది కేవలం అపోహే అని నిరూపించారు కర్నూలు జిల్లా ప్యాపిలి ఎస్సై. తన దుకాణంలో పనిచేసే గుమాస్తాకు కరోనా సోకిందనీ... తనకీ సోకే ఉంటుందని ఓ వ్యాపారి భయపడిపోయారు. కరోనా టెస్టులు చేయించుకొని ఇంటికి వచ్చిన తరువాత గుండెపోటు వచ్చి అతడు మరణించారు. అతనికి సైతం కరోనా ఉందేమోనని అనుమానంతో అంత్యక్రియలు చేయటానికి వారి తరఫు బంధువులు, సన్నిహితులు ముందుకు రాలేదు.

ఈ సమాచారం అందుకున్న ప్యాపిలి ఎస్సై మారుతి శంకర్... మృతుడికి అంత్యక్రియలు చేసేందుకు తనకు తానుగా ముందుకు వచ్చారు. మారుతి శంకర్ సహా ఐదుగురు పోలీసు సిబ్బందితో.. పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఎస్సై స్వయంగా ఆటో నడిపి.. దహన సంస్కారాలు నిర్వహించారు. కరోనా వచ్చిన వ్యక్తుల విషయంలో గానీ, అనుమానితుల పట్లగానీ వివక్ష చూపొద్దని ఈ సందర్భంగా ఆయన ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details