ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ పెద్దాయన... ఆరు సార్లు ఏకగ్రీవంగా..! - కర్నూలు జిల్లా ఎన్నికల వార్తలు

ఎన్నికల్లో నాయకుల జాతకం ఐదేళ్లకోసారి మారుతుంది. ప్రజలకు సేవ చేసి మంచి పేరు సంపాదిస్తే కానీ రెండో సారి గెలవడం కష్టం. అలాంటిది ఆరు సార్లు ఏకగ్రీవంగా సర్పంచి ఎన్నికై రికార్డు సృష్టించారు.. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం కుందనగుర్తి గ్రామానికి చెందిన పాటిల్‌ హేమంత్‌రెడ్ఢి. తన 24 వఏటా సర్పంచిగా బాధ్యతలు చేపట్టిన ఆయన, దాదాపు 37 ఏళ్లపాటు సర్పంచిగా పని చేశారు. 1964లో ప్రజల కోరిక మేరకు రాజకీయల్లోకి వచ్చారు. 2001 వరకు సర్పంచిగా పోటీ చేశారు. 2001లో సర్పంచి స్థానాన్ని బీసీలకు కేటాయించడంతో ఆయన ఎన్నికలకు దూరమయ్యారు. ఇటివలే 80వ పుట్టిన రోజు వసంతం జరుపుకొన్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పాటిల్‌ హేమంత్‌రెడ్ఢి గురించి తెలుసుకుందాం.

Patil Hemanth Reddy worked as sarpanch
సర్పంచి పదవికే దర్పణం

By

Published : Feb 11, 2021, 5:50 PM IST

పాటిల్‌ హేమంత్‌రెడ్డిది వ్యవసాయ కుటుంబం. కర్నూలు మొదటి జడ్పీ ఛైర్మన్‌గా పని చేశారు. ఆలూరు నియోజకవర్గంలో ఏకైక ఏకగ్రీవ ఎమ్మెల్యే మొలగవల్లి లక్ష్మీకాంత్‌రెడ్డితో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అప్పట్లో గ్రామాభివృద్ధికి ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు తక్కువగా ఉండేవి. ఇంటి పన్నులు కట్టించుకోవాలాంటే పెద్దరికం అడ్డు వస్తుండటంతో పన్నులన్నీ సర్పంచే కట్టాల్సిన రోజులవి. ప్రజల బాగోగుల కోసం వారే కట్టారు. గ్రామంలో ఉత్సవం జరిగినా, పెళ్లి జరిగినా గ్రామానికి అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చినా చేతి నుంచి ఖర్చు చేసి పదవికే వన్నె తెచ్చారు. ఆ రోజుల్లోనే చేతి నుంచి ఎంత తక్కువ అనుకున్నా.... రూ.లక్ష వరకు ఖర్చు చేసేవారు.

గ్రామాభివృద్ధికి ఎమ్మెల్యే, ఎంపీ, జడ్పీ ఛైర్మన్‌తో మాట్లాడి నిధులు తెచ్చి రోడ్డు, తాగునీటి ట్యాంకులు నిర్మించారు. ఇప్పుడు గ్రామ పంచాయతీలకు నిధుల గలగలాడుతున్నాయి. అందుకే ఆ పదవికి చాలా మంది పోటీ పడుతున్నారు. ఎన్నికల్లో ఎలాగైన గెలువాలని రూ.లక్షలు ఖర్చు పెడుతున్నారు. మద్యం, డబ్బు, తాయిలాలు కొదవలేదు. దీనికి తోడు దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్నడుతున్నారు. ఇప్పుడు ఎన్నికలంటే ఖర్చుతో కూడిన పెట్టుబడిగా మారింది. హేమంతరెడ్డి కుటుంబం ప్రస్తుతం అనంతపురం జిల్లా, గుంతకల్లు పట్టణంలో ఉంటోంది. ఆయన కుమారులు కుళ్లు పట్టిన రాజకీయాలకు దూరంగా ఉండటం విశేషం.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details