ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నంద్యాలలో పసుపు కొనుగోలు కేంద్రం ప్రారంభం - నంద్యాల మార్కెట్ యార్డులో పసుపు కొనుగోలు కేంద్రం వార్తలు

క్వింటాకు రూ. 6,850 కనీస మద్దతు ధరతో పసుపు పంట కొనుగోలు చేయనున్నట్లు.. కర్నూలు జిల్లా నంద్యాల వ్యవసాయ మార్కెట్ అధికారులు తెలిపారు. పసుపు కొనుగోలు కేంద్రం ప్రారంభించినట్టు చెప్పారు.

pasupu crop purchase centre started at nandyala in kurnool district
నంద్యాల మార్కెట్ యార్డులో పసుపు కొనుగోలు కేంద్రం

By

Published : May 14, 2020, 2:12 PM IST

కర్నూలు జిల్లా నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డులో పసుపు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. క్వింటాకు రూ. 6,850 కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయనున్నారు.

పంటను తీసుకొచ్చే రైతులు తమ పేర్లను ఈ-క్రాప్​లో నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఎకరాకు 30 క్వింటాలు, ఒక రైతు వద్ద గరిష్ఠంగా 40 క్వింటాళ్ల పసుపును కొంటామని.. కొనుగోలు కేంద్రం అధికారి జి. రాజు తెలిపారు. ఇక్కడకు 18 మండలాల నుంచి రైతులు పంటను తీసుకొచ్చే అవకాశాలున్నాయని చెప్పారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details