Parents received gold medal for deceased son: పిల్లలు విజయాలు సాధిస్తే.. పది మందికి చెబుతూ మురిసిపోతుంటారు. ఏకంగా జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిన తమ కుమారుడిని అభినందిస్తే.. ఇక ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిదే. కానీ, ఆ విజయం సాధించిన కుమారుడే లేకపోతే.. ఆ బాధ వర్ణణాతీతం.
కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన బంగారు వ్యాపారి ఇమ్రాన్ షేక్, గౌసియా దంపతుల కుమారుడు ఎస్.లుబేద్(7) వివేకవర్ధిని పాఠశాలలో చదివేవాడు. ఆల్ ఇండియా ఒలింపియాడ్ సైన్స్ పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలవగా.. జాతీయ స్థాయిలో నాలుగో స్థానంలో నిలిచాడు. 2019-20లో ముంబయికి చెందిన నేషనల్ నం.1 సంస్థ ఆధ్వర్యంలో ఆల్‌ఇండియా ఒలింపియాడ్ పోటీలు నిర్వహించారు.