Parents protest for school: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని సోగనూరు ప్రాథమికోన్నత పాఠశాల శిథిలావస్థకు చేరింది. ప్రమాదకరంగా మారడంతో పిల్లలను బడికి పంపలేమని విద్యార్థులను వారి తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. పాఠశాలలో 235 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాల గదులు శిథిలావస్థకు చేరడంతో వాటి కింద చదువుకుంటున్న పిల్లలపై పెచ్చులూడి పడే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. భవనానికి మరమ్మతులు చేయాలని, లేదా నూతన గదులు నిర్మించాలని కోరారు. అప్పటివరకు తమ పిల్లలను బడికి పంపలేమని తీర్మానం చేశారు.
Parents Protest For School: శిథిలావస్థకు భవనం..స్కూల్ వద్దంటున్న తల్లిదండ్రులు - kurnool district
Parents protest for school: కర్నూలు జిల్లా సోగనూరు ప్రాథమికోన్నత పాఠశాలలోని విద్యార్థులను వారి తల్లిదండ్రులు ఇంటికి తీసుకువెళ్లారు. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో.. ప్రమాదకరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
శిథిలావస్థకు చేరిన సోగనూరు ప్రాథమిక పాఠశాల భవనం