కర్నూలు జిల్లా పాణ్యంలో నూతనంగా నిర్మించిన సిమెంటు రహదారులను ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో మండలంలోని అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, ఇతర అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. 14వ ఫైనాన్స్ నిధుల ఖర్చులు వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపించే విధంగా పనులు చేపట్టాలన్నారు.
'గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టండి' - kurnool dst latest roads news
పాణ్యం నియోజకవర్గంలోని అన్నీ గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆదేశించారు. నూతనంగా నిర్మించిన సిమెంట్ రహదారులను ఆయన ప్రారంభించారు.
!['గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టండి' panyam consistency mla rambhupal reddy opened in cement roads](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7832411-5-7832411-1593515476028.jpg)
panyam consistency mla rambhupal reddy opened in cement roads