ముఖ్యమంత్రి వస్తుంటే.. చాలా మంది వ్యక్తిగత కోర్కెల చిట్టా సిద్ధం చేసుకుంటారు. కానీ.. ఆ ఊరంతా ఒకే సమస్యను సీఎం దృష్టికి తేవాలని సిద్దమైంది. ఈనెల 5న.. సీఎం జగన్ కర్నూలు జిల్లా ఆదోనిలో పర్యటించనున్నారు. కాగా.. ముఖ్యమంత్రి పర్యటనను.. అడ్డుకోవాలని పాండవగల్లు గ్రామస్తులు నిర్ణయించారు. తమ గ్రామ చెరువు కింద ఉన్న 20 ఎకరాల భూమిని స్థానిక నేతలు, అధికారుల అండదండలతో ఆక్రమించుకున్నారని వాపోయారు. ఆక్రమణలపై అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని, అందుకే జగన్ పర్యటనను అడ్డుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. తమ గ్రామ చెరువుకు.. ఆక్రమణదారుల చెర నుంచి విముక్తి కల్పించాలని.. వేడుకుంటున్నారు.
సీఎం జగన్ను అడ్డుకుంటాం: పాండవగల్లు గ్రామస్థులు - సీఎం జగన్ను అడ్డుకుంటామన్న పాండవగల్లు గ్రామస్థులు
కర్నూలు జిల్లా ఆదోనిలో ఈ నెల 5న సీఎం జగన్ పర్యటించనున్నారు. అయితే.. ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకోవాలని పాండవగల్లు గ్రామస్తులు నిర్ణయించారు. తమ గ్రామ చెరువు కింద ఉన్న 20 ఎకరాల భూమిని స్థానిక నేతలు, అధికారుల అండదండలతో ఆక్రమించుకున్నారని వాపోయారు.
సీఎం జగన్ను అడ్డుకుంటామన్న పాండవగల్లు గ్రామస్థులు
TAGGED:
ap latest news