కర్నూలు నగరంలోని సంకల్ బాగ్ పుష్కర ఘాట్లో తుంగభద్ర పుష్కరాలు నాలుగో రోజు వైభవంగా కొనసాగాయి. వేద పండితులు నదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచ హారతులు పట్టారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.
మంత్రాలయంలో..
తుంగభద్ర పుష్కరాలు, కార్తీక మాసం రెండూ కలిసి రావడం వల్ల భక్తులతో పుష్కర ఘాట్లు కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునే మంత్రాలయం వద్ద తుంగభద్ర నదిలో జల్లు స్నానం చేశారు. వినాయక ఘాట్, సంత మార్కెట్ ఘాట్ వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. పుష్కరాలకు వచ్చే వారికి వైద్య పరీక్షలు చేపట్టారు.
ఇదీ చదవండి:
కర్నూలు డీఎంహెచ్ఓ కార్యాలయం ముందు మహిళ ధర్నా