చిత్తూరు జిల్లా పలమనేరు తహసీల్దార్ శ్రీనివాసులు మానవత్వాన్ని చాటుకున్నారు. గత నెలలో పలమనేరు రహదారిపై అనాథగా ఉన్న వృద్ధురాలిని ఆయన చేరదీసి జిల్లా కేంద్రంలోని స్థానిక అమ్మఒడి ఆశ్రమంలో చేర్చారు. వృద్ధాప్యంతో ఆమె శుక్రవారం రాత్రి మృతి చెందింది. ఈ క్రమంలో ఆశ్రమ నిర్వాహకులతో కలిసి.. తహసీల్దార్ ఆమె పాడెను మోసి అంత్యక్రియలు నిర్వహించారు.
తహసీల్దార్ మానవత్వం.. అనాథ వృద్ధురాలికి అంత్యక్రియలు - government officer conducted old woman funeral news
ఏ దిక్కూ లేని ఓ వృద్ధురాలిని ఆ ప్రభుత్వ అధికారి చేరదీశారు. ఓ ఆశ్రమంలో చేర్పించి ఆమె బాగోగులు చూశారు. అక్కడ వృద్ధాప్యంతో ఆమె మరణించగా.. కన్నబిడ్డలా పాడెను మోసి అంత్యక్రియలు నిర్వహించారు. మానవత్వం కనుమరుగవుతోన్న ఈ రోజుల్లో.. ఆ అధికారి తన గొప్ప మనసు చాటుకున్నారు.
తహసీల్దార్ మానవత్వం.. అనాథ వృద్ధురాలికి అంత్యక్రియలు
TAGGED:
palamaneru tahasildar news