ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేను మావోయిస్టును కాదు: పద్మక్క - padmathi alias padmakka news

పోలీసులు అరెస్ట్​ చేసిన పద్మావతి అలియాస్ పద్మక్క తాను మావోయిస్టును కాదని స్పష్టం చేశారు. అనుమానంతోనే పోలీసులు తనని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

padmavathi alias padmakka
పద్మావతి అలియాస్ పద్మక్క

By

Published : Nov 6, 2020, 11:30 AM IST

మావోయిస్టులతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని పద్మావతి అలియాస్ పద్మక్క కర్నూల్లో తెలిపారు. తనపై అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి వదిలేసినట్లు చెప్పారు. మూడు నెలలుగా నంద్యాలలో తన తమ్ముడి వద్ద ఉంటున్నట్లు చెప్పారు.

తన కూతురిని కలుసుకునేందుకు ఈ నెల 4న నంద్యాల నుంచి బెంగుళూరుకు ఆర్టీసీ బస్సులో వెళుతుండగా... పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఆమె తెలిపారు. పోలీసులకు తనపై ఎందుకు అనుమానం వచ్చిందో తెలియటం లేదన్నారు.

ABOUT THE AUTHOR

...view details