ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

MLA BALANAGI REDDY : 'ఓటీఎస్..పేదలకు వరం' - OTS

కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఓటీఎస్ పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి పాల్గొన్నారు. ఈ పథకం పేదలందరికీ వరంగా మారిందని అన్నారు.

మంత్రాలయంలో ఓటీఎస్ పత్రాల పంపిణీ
మంత్రాలయంలో ఓటీఎస్ పత్రాల పంపిణీ

By

Published : Dec 27, 2021, 7:01 PM IST

కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఓటీఎస్ పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి హాజరయ్యారు. ఓటీఎస్ పథకం నిరుపేదలందరికీ వరంగా మారిందని ఎమ్మెల్యే అన్నారు.

జగనన్న శాశ్వత గృహ పత్రాల ద్వారా భవిష్యత్తులో క్రయ విక్రయాలు జరిపేందుకు వీలవుతుందని తెలిపారు. అంతేకాకుండా బ్యాంకుల నుంచి రుణం తీసుకోవచ్చని వివరించారు.

ఆథోని సబ్ డివిజన్​లో మంత్రాలయం నియోజకవర్గం నాల్గో స్థానంలో నిలవడం ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. అనంతరం 508 మంది లబ్ధిదారులకు ఓటీఎస్ పత్రాలను అందజేశారు.


ఇదీచదవండి :

ABOUT THE AUTHOR

...view details