ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓర్వకల్ విమానాశ్రయంలో సౌకర్యాల నిర్మాణానికి 4.65 కోట్లకు పాలనానుమతి - ఓర్వకల్ విమానాశ్రయం తాజా వార్తలు

ఓర్వకల్ విమానాశ్రయంలో వీఐపీ లాంజ్ సహా వివిధ సౌకర్యాల నిర్మాణానికి 4.65 కోట్లకు ప్రభుత్వం పాలనానుమతి మంజూరు చేసింది. గతంలో 88 కోట్ల రూపాయల వ్యయంతో ఓర్వకల్లు విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం పాలనానుమతులు ఇచ్చింది.

Orvakal Airport
Orvakal Airport

By

Published : Jul 28, 2020, 4:13 AM IST

కర్నూలులోని ఓర్వకల్ విమానాశ్రయంలో వీఐపీ లాంజ్ సహా వివిధ సౌకర్యాల నిర్మాణానికి 4.65 కోట్లకు ప్రభుత్వం పాలనానుమతి మంజూరు చేసింది. విమానాశ్రయంలో వీఐపీ లాంజ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ భవనంలో అదనపు నిర్మాణాలు, విమాన సిబ్బంది బ్యాకప్ రూమ్ , ప్రయాణికుల టెర్మినల్ లో హెవాక్ సిస్టం సహా.. ఇతర నిర్మాణాల కోసం నిధులు వెచ్చించాలని ఏపీ ఎయిర్ పోర్ట్ డెవలప్మెంట్ కార్పోరేషన్ కు సూచిస్తూ.. ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. గతంలో 88 కోట్ల రూపాయల వ్యయంతో ఓర్వకల్లు విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం పాలనానుమతులు ఇచ్చింది. ప్యాకేజీ 1 కింద 62 కోట్లు, ప్యాకేజీ 2 కింద 26 కోట్ల వ్యయంతో వివిధ పనులు చేపట్టారు. ప్యాకేజీ 1 లో 4.94 కోట్ల రూపాయల మేర మిగులు సాధించినట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. మరోవైపు విమానాశ్రయంలో చేపట్టాల్సిన అదనపు పనుల కోసం ఈ 4.65 కోట్లు వెచ్చించేందుకుగానూ ఏపీ ఎయిర్ పోర్టు డెవలప్మెంట్ కార్పోరేషన్ కు పాలనానుమతులు మంజూరు చేసింది.

ABOUT THE AUTHOR

...view details