ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Lokayukta New Office: కర్నూలులో లోకాయుక్త కార్యాలయం ప్రారంభం - లోకాయుక్త కార్యాలయం ప్రారంభం

కర్నూలులోని ప్రభుత్వ అతిథి గృహంలో లోకాయుక్త కార్యాలయం ప్రారంభమైంది. లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి.. కార్యాలయాన్ని ప్రారంభించారు.

Lokayukta office
Lokayukta office

By

Published : Aug 28, 2021, 2:14 PM IST

Updated : Aug 29, 2021, 7:08 AM IST

కర్నూలులో లోకాయుక్త కార్యాలయం ప్రారంభం

కర్నూలు ప్రభుత్వ అతిథి గృహంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లోకాయుక్త సంస్థ కార్యాలయాన్ని లోకయుక్త జస్టిస్ పి. లక్ష్మణ రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ అతిథి గృహంలోని మూడో నెంబర్ గదిలో ఏర్పాటు చేసిన రాష్ట్ర లోకాయుక్త సంస్థ కార్యాలయం ఏర్పాటు చేశారు.

వెనుక బడిన కర్నూలు ప్రాంతంలో ప్రజలకు అవగహన కోసం లోకాయుక్త ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని లక్ష్మణ రెడ్డి అన్నారు. సమస్యల పరిష్కరం కోసం ప్రత్యక్షంగా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా సమస్యను తమదృష్టికి తీసుకుని వస్తే సమస్యలను పరిష్కరిస్తామని లోకాయుక్త జస్టిస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు పాల్గొన్నారు.

Last Updated : Aug 29, 2021, 7:08 AM IST

ABOUT THE AUTHOR

...view details