ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలు వ్యవసాయ మార్కెట్​లో ఈ-నామ్ కష్టాలు.. నిలిచిన ఉల్లి విక్రయాలు

కర్నూలు వ్యవసాయ మార్కెట్​లో ఉల్లి కొనుగోళ్లు మళ్లీ నిలిచిపోయాయి. సోమవారం బహిరంగ వేలంలో వ్యాపారులు ఉల్లి విక్రయాలు జరపగా.. అధికారులు ఈ-నామ్​ పద్ధతిలోనే కొనుగోళ్లు చేయాలని ఆదేశించారు. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. రైతులు, మార్కెట్​లో పనిచేసే మహిళలు, హమాలీలు పెద్ద ఎత్తున చేరుకుని ఉల్లి క్రయవిక్రయాలు కొనసాగించాలని ఆందోళన చేపట్టారు.

కర్నూలు వ్యవసాయ మార్కెట్​లో నిలిచిన ఉల్లి విక్రయాలు
కర్నూలు వ్యవసాయ మార్కెట్​లో నిలిచిన ఉల్లి విక్రయాలు

By

Published : Oct 12, 2021, 2:24 PM IST

Updated : Oct 12, 2021, 4:50 PM IST

కర్నూలు వ్యవసాయ మార్కెట్​లో ఉల్లి విక్రయాలు గందరగోళంగా మారాయి. మార్కెట్​లో ఈ-నామ్ విధానంలో ఉల్లి కొనుగోలు చేయాలని అధికారులు ఆదేశించినప్పటి నుంచి వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఉల్లి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కర్నూలు మార్కెట్​లో నెల రోజుల నుంచి ఉల్లి విక్రయాలు పూర్తిస్థాయిలో నిలిచిపోయాయి.

సోమవారం నుండి మళ్లీ మార్కెట్​లో ఉల్లి కొనుగోలు చేస్తామని అధికారులు ప్రకటించడంతో రైతులు పంటను మార్కెట్​కు తీసుకొచ్చారు. సోమవారం మార్కెట్​లో ఈ-నామ్ విధానంలో కాకుండా బహిరంగ వేలం పద్దతిలో ఉల్లి క్రయవిక్రయాలు జరిగాయి. విషయం అధికారుల దృష్టికి పోవడంతో ఈరోజు ఈ-నామ్ పద్దతిలోనే కొనుగోలు చేయాలని చెప్పడంతో.. ఉల్లి కొనుగోళ్లు మళ్లీ అగిపోయాయి. రైతులు, వ్యాపారులు ఈ-నామ్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. మార్కెట్ కార్యదర్శి జయలక్ష్మి ఛాంబర్ వద్ద.. రైతులు, మార్కెట్​లో పనిచేసే మహిళలు, హమాలీలు పెద్ద ఎత్తున చేరుకుని ఉల్లి క్రయవిక్రయాలు కొనసాగించాలని ఆందోళన చేశారు. విషయం ఉన్నతాధికారులకు తెలిపానని.. వారి ఆదేశాల మేరకు తదుపరి ప్రక్రియ ఉంటుందని జయలక్ష్మి తెలిపారు. త్వరగా ఉల్లి కొనుగోలు చెయ్యాలని రైతులు కోరుకున్నారు.

Last Updated : Oct 12, 2021, 4:50 PM IST

ABOUT THE AUTHOR

...view details