ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉల్లి ధరలు...సరికొత్త రికార్డులు ! - Onion prices in ap

ఉల్లి ధరలు కొత్త రికార్డులు తాకుతూ వినియోగదారుల్లో గుబులు రేపుతున్నాయి. తాజాగా కర్నూలు ఉల్లి మార్కెట్‌లో... చరిత్రలోనే ఎరుగని స్థాయిలో రికార్డు ధరలు పలికాయి. క్వింటా ఉల్లి ఏకంగా 10 వేల 180 రూపాయల గరిష్ఠ ధర దక్కించుకొంది. రైతు నుంచి వ్యాపారులు కొనుగోలు చేసిన ఉల్లే కిలో వంద దాటింది.

ఉల్లి ధరలు...సరికొత్త రికార్డులు !
ఉల్లి ధరలు...సరికొత్త రికార్డులు !

By

Published : Dec 3, 2019, 6:09 AM IST

సామాన్యులకు అందని ద్రాక్షగా మారిన ఉల్లి ఇప్పట్లో దిగివచ్చేలా కనిపించడం లేదు. బహిరంగ మార్కెట్లో ఇప్పటికే వంద రూపాయలు దాటిన కిలో ఉల్లి.... 200 మార్కు అందుకున్నా ఆశ్చర్యం అక్కర్లేదని అధికారులు చెప్తున్నారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్లో రైతుల నుంచే సరాసరి కిలో వంద చొప్పున వ్యాపారులు కొనుగోలు చేస్తుండటం పరిస్థితికి నిదర్శనం.

ఉల్లి ధరలు కొత్త రికార్డులు తాకుతూ వినియోగదారుల్లో గుబులు రేపుతున్నాయి. తాజాగా కర్నూలు ఉల్లి మార్కెట్‌లో... చరిత్రలోనే ఎరుగని స్థాయిలో రికార్డు ధరలు పలికాయి. క్వింటా ఉల్లి ఏకంగా 10 వేల 180 రూపాయల గరిష్ఠ ధర దక్కించుకొంది. రైతు నుంచి వ్యాపారులు కొనుగోలు చేసిన ఉల్లే కిలో వంద దాటింది.దింతో రైతుల్లో ముందెన్నడూ లేనంత ఆనందం నెలకొంది.

కర్నూలు జిల్లాలోని కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, బనగానపల్లి, డోన్ నియోజక వర్గాల్లో ఉల్లి ఎక్కువగా సాగు చేస్తారు. ఈ ఏడాది సుమారు 30 వేల హెక్టార్లలో పంట వేశారు. ఖరీఫ్ సీజన్ ఆరంభంలో వర్షాభావ పరిస్థితులతో చాలా మంది సాగుకు దూరంగా ఉండగా ఆ తర్వాత వేసిన పంట సైతం భారీ వర్షాలకు కుళ్లిపోయింది. ఉల్లి ఎక్కువగా సాగుచేసే మహారాష్ట్ర, గుజరాత్, కర్నాటకల్లోనూ భారీ వర్షాలు, వరదల కారణంగా పంట తుడిచి పెట్టుకుపోయింది. ఫలితమే... కర్నూలు ఉల్లికి డిమాండ్ తారస్థాయికి చేరింది.

ఉల్లి ధరలు...సరికొత్త రికార్డులు !

కర్నూలు జిల్లాలో జులై, ఆగస్టు మాసాల్లో వేసిన ఉల్లి ప్రస్తుతం మార్కెట్‌కు వస్తోంది. మరోవైపు ఉల్లి దిగుబడులు అంతకంతకూ తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌కు వెయ్యి క్వింటాళ్ల ఉల్లి మాత్రమే వస్తోంది. మన రాష్ట్రం సహా ఇతర ప్రాంతాల నుంచి కూడా... ఉల్లికి డిమాండ్ పెరిగింది. వ్యాపారులతో పోటీపడి రాష్ట్ర ప్రభుత్వం సైతం కొంటోంది. ఉల్లి ధరలు బహిరంగ మార్కెట్లో త్వరలో 2 వందలకు చేరినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


దేశవ్యాప్తంగా ఉల్లిపాయల ధరలు ఆకాశాన్ని తాకుతుండడంతో... కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఉల్లిపాయలను నిల్వ చేసే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. దేశవ్యాప్తంగా ఉల్లి ధరల పెరుగుదలపై 11 ప్రధాన ఉల్లి ఉత్పత్తి రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా సమీక్ష నిర్వహించారు. సమీక్షలో పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీసం సాహ్ని...ఉల్లి ధరల నియంత్రణకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. కేంద్రం దిగుమతి చేసుకునే ఉల్లిని ఏపీకి సరఫరా చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఉల్లి నిల్వలు, అధిక ధరల నియంత్రణకు విజిలెన్సు విభాగాన్ని అప్రమత్తం చేశామని వివరించారు.

ఇదీచదవండి

క్వింటాలు ఉల్లి@ 10 వేల రూపాయలకు పైనే...!

ABOUT THE AUTHOR

...view details